సీఎం చంద్రబాబు SC వర్గీకరణ రూపకర్త: పవన్ కళ్యాణ్

ఏపీలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని పవన్ అన్నారు. 'ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ బిల్లుకు మనస్పూర్తిగా ఆమోదం పలుకుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు, మందకృష్ణ కారణం. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్