AP: విద్యార్థులకు CM చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. బాగా చదువుకుని విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలన్నారు. శ్రీ సత్య సాయి(D) కొత్తచెరువులో సీఎం విద్యార్థులతో మాట్లాడారు. మీలో ఎంత మంది రాజకీయ నాయకులు అవ్వాలని అనుకుంటున్నారని అని అడగ్గా.. ఎవరూ స్పందించలేదు. దీంతో చదువుకున్న వాళ్లంతా ఉద్యోగాలు చేసుకుంటూ పోతే ఎలా అంటూ చంద్రబాబు సరదాగా అన్నారు. రాజకీయాలు జీవితాలను మారుస్తాయని.. మంత్రి లోకేశ్ విద్యా రంగంలో మార్పులకు కృషి చేస్తున్నాడన్నారు.