AP: బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు (శనివారం) మధ్యాహ్నం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ఢిల్లీలోని న్యాయ నిపుణులతో సీఎం చర్చించారు. న్యాయపరమైన అంశాలపై వారి సూచనలు తీసుకున్న అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.