ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిన వైద్యులు, సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన ఘటనలో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణీ మల్లేశ్వరి వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్