15 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిదని సీఎం హితవు పలికారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారో.. అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్