అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు(వీడియో)

TG: అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి అగ్నిమాపక శాఖ నూతన వాహనాలను జెండా ఊపి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ చేపట్టారు. అందులో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్