స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

AP: నెల్లూరు నగరంలోని మైపాడు గేటు వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక మార్కెట్‌లో 30 మాడ్యులర్‌ కంటెయినర్లలో 120 షాపులు ఏర్పాటు చేశారు. వీధి వ్యాపారులకు స్థిర వ్యాపార వేదికను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని మంత్రి నారాయణ, నెల్లూరు కార్పొరేషన్ అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్