ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం మ.1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో సమావేశమవుతారు. 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ అవుతారు. రాత్రి 7 గంటలకు రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. బుధవారం కేంద్ర మంత్రులు మన్షుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.

సంబంధిత పోస్ట్