కుప్పం నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం

AP: కుప్పం నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో CM చంద్రబాబు సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో కూడా “పొలిటికల్ గవర్నెన్స్” ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ సమన్వయంతో సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలను విస్మరించబోమని హామీ ఇచ్చారు. 2029లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. “ఇంటికో పారిశ్రామికవేత్త” విధానాన్ని ప్రజలు, కార్యకర్తలు వినియోగించుకోవాలని సూచించారు. SIR ప్రక్రియను పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్