AP: తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. శ్రీగాయత్రీ నిలయం వద్ద సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ స్వాగతం పలికారు. బేడి ఆంజనేయస్వామి దర్శించుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కంకణాన్ని ధరించారు.