AP: నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను కనీసం 50 శాతం పెంచితేనే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని అన్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అదనంగా ఏర్పడే నియోజకవర్గాలను పూర్తిగా మహిళలకు కేటాయించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.