సీఎం చంద్రబాబు నేడు (శుక్రవారం) కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. జమ్మలమడుగులోని గూడెం చెరువలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.