మే 1న కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: మే 1న సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని పామిడిముక్కల మండలంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీఎం రాక కోసం కపిలేశ్వరపురం గ్రామంలో హెలిప్యాడ్, అనుసంధాన రహదారి అభివృద్ధి చేస్తున్నారు. పామిడిముక్కల గ్రామంలో బహిరంగ సభ వేదిక, ప్రదర్శన స్టాళ్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్