ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో 25 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సొంత ఇంటి కల నెరవేరనుంది.