ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మాన్సుఖ్ మాండవీయ తదితరులను కలిసే అవకాశం ఉంది. అలాగే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తిమంత్రితో పాటు CWC అధికారులతో సమావేశం కానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి జరిగే లబ్ధి, ఇటీవల తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.