నేడు జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం

AP:  కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మంత్రులతో ఆయన సమావేశమవుతారు. ఈ సమావేశంలో మార్కాపురం, మదనపల్లె వంటి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై CM తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రజల అభ్యంతరాలను సేకరించిన మంత్రుల కమిటీ ప్రతిపాదనపై నేడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్