సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండ్రోజుల సింగపూర్ పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుంచి బెంగళూరు మీదుగా సింగపూర్‌కు వెళ్లిన సీఎం, సాయంత్రానికి అక్కడికి చేరుకోనున్నారు. సోమ, మంగళవారాల్లో సింగపూర్ మంత్రులు, ప్రధాని, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. సోమవారం ఉదయం భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో, స్టార్టప్ వెంచర్ కేపిటలిస్టులతో, యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్‌తో సమావేశాలు, లంచ్‌లో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్