నేడు, రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: నేడు, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ విశాఖకు చేరుకునే ఉపరాష్ట్రపతికి సీఎం స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతితో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. రేపు సీఎం చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, ఐటీ పెట్టుబడులు, విద్యా రంగ కార్యక్రమాలపై కీలక అంశాలు చర్చించనున్నారు. సీఎం టూర్ నేపథ్యంలో విశాఖలో భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్