AP: రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.