మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించి, వాటికి సరైన ధరలు లభించేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ విధానాల ద్వారా పంటలకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంపై సీఎం దృష్టి సారించారు.