కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

AP: రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను సెంట్రల్ పోర్టల్‌లో నమోదు చేయడానికి గడువును మరో ఏడాది పొడిగించాలని కోరుతూ CM చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. డిసెంబర్ 5తో గడువు ముగియనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో 4,748 రిజిస్టర్డ్, 10,000 అన్ రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3,100 ఆస్తుల వివరాలు అప్‌లోడ్ చేసినా, సాంకేతిక, స్టేక్ హోల్డర్ల సమస్యల వల్ల పురోగతికి ఆటంకాలు ఎదురవుతున్నాయని సీఎం వివరించారు.

సంబంధిత పోస్ట్