ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రత్యేక విమానంలో బయల్దేరి, సాయంత్రం ఐఏఎస్ అధికారి వికాస్ మర్మట్ వివాహానికి హాజరుకానున్నారు. రాత్రికి జైపూర్‌లోనే బస చేసి, రేపు ఉదయం ఢిల్లీలో 9:30 AM నుంచి 4:30 PM వరకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.