AP: పులువూరు కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నామని, ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు ఆమోదించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలకు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి తగినంత సమయం ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీలో లోపాలను అధ్యయనం చేసి, విధాన నిర్ణయాల ద్వారా వాటిని సరిచేస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.