AP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా దర్శనంలో పాల్గొన్నారు.