పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించాలని సూచించారు. సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్