విశాఖ పోలీసులను ప్రశంసించిన సీఎం

AP: విశాఖ పోలీసుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, తాను ఆఫీస్‌కు వెళ్తున్న క్రమంలో విశాఖ-జగదాంబ జంక్షన్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కొట్టినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. యువతికి క్షమాపణ చెప్పించారు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్