దివ్యాంగుడికి భోజనం తినిపించిన మహిళ.. సీఎం ప్రశంసలు (వీడియో)

AP: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడుకి మహిళా సిబ్బంది గాయత్రి స్వయంగా అన్నం తినిపించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి ఆమెను అభినందించారు. ‘శభాష్ గాయత్రి. ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. ‘మానవ సేవే మాధవ సేవ’ అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం’ అని సీఎం ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕