AP: విజయవాడలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులు, శాఖలను ప్రభుత్వం సత్కరించింది. 21 విభాగాల్లో మొత్తం 69 రాష్ట్రస్థాయి, 1,257 జిల్లా స్థాయి అవార్డులు ప్రదానం చేశారు. స్వచ్ఛ మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, స్కూల్స్, ఆసుపత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, బస్ స్టేషన్లు, పరిశ్రమలు కేటగిరీల్లో అవార్డులు ఇచ్చారు.