కొలికపూడి, చిన్ని మధ్య విభేదాలపై సీఎం అసహనం

AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగించారు. కొలికపూడి, చిన్నిని పిలిచి మాట్లాడాలని కమిటీకి సూచించారు. ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని, విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చాక తాను ఇద్దరితో మాట్లాడతానని నేతలో చెప్పినట్లు సమాచారం. ఈ విభేదాలు కొలిక్కి రాకపోతే కఠిన చర్యలకు వెనుకాడబోనని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్