AP: విజయవాడలో ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులతో తనకు అనుబంధం ఉందన్నారు. మీడియా వార్తలను ప్రతిరోజూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి మీడియా ధోరణులు మారాయని, కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలో ఐజేయూ కార్యాలయానికి స్థలం కేటాయింపు అంశాన్ని సబ్-కమిటీకి అప్పగిస్తామని వెల్లడించారు. విలేకర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సీఎం స్పష్టం చేశారు.