AP: నరసాపురంలో జరిగిన సమీక్షా సమావేశంలో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నరసాపురం నియోజకవర్గం వెనుకబడి ఉందని, అన్ని రంగాల్లోనూ మైనస్‌లో ఉందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను తనకు చెప్పడమే కాకుండా, అవసరమైతే ప్రజల సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. నోడల్ అధికారిని మార్చి, చురుగ్గా పనిచేసేవారిని నియమించాలని ఆదేశించారు.