తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విజయవాడలో జరిగే ‘విజయవాడ ఉత్సవ్ 2.0' కార్యక్రమంలో పాల్గొని, సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు, ముఖ్యంగా చెన్నైకి కృష్ణా నీటి సరఫరాపై చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబుతో భేటీ అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా కలవనున్నట్టు TVK వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ అయ్యే షెడ్యూల్ లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.