కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో ‘బూబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొని మాట్లాడారు. ‘ప్రతి ఇంటికి ఇంత ఇస్తాం.. అంత ఇస్తాం అని టీడీపీ ప్రచారం చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ మోసాలను వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని తెలిపారు.