కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది: YS జగన్‌

ఏపీలో కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరోపించారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్‌ పనులను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి అప్పగించి అక్రమాలకు తెరతీశారని, 16వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకతను చంద్రబాబు ధ్వంసం చేశారని విమర్శించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున, నిజనిజాలు వెలికితీయడానికి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఫలితాల ప్రకటనలోనూ పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్