AP: గతేడాది జరిగిన ఎన్నికల్లో TDP, JSP, BJP కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే YCPపై వ్యతిరేకత, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ సిక్స్ హామీలు నచ్చడంతో ప్రజలు 164 సీట్లతో కూటమికి పట్టం కట్టారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అవుతోంది. చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, సత్యకుమార్ మంత్రిగా 3 పార్టీల అగ్రనేతలు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టి సుపరిపాలన దిశగా ముందుకు సాగుతున్నారు.