ఉపాధి సిబ్బంది బదిలీలకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా

AP: గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలోని ఉపాధి హామీ పథకం సిబ్బంది బదిలీలకు కూటమి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల్లో అంతర్గత బదిలీలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో, ఈ నెల 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 20 వరకు బదిలీలపై వినతులు స్వీకరించి పరిశీలించనున్నారు. 22న కొత్తగా నియమించిన పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది. అయిదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్