'ఆడబిడ్డ నిధి'పథకంపై కూటమి సర్కార్ కసరత్తు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం 'ఆడబిడ్డ నిధి' 'నిరుద్యోగ భృతి పథకాల' అమలుకు కేంద్రం నుంచి సహాయం, మద్దతు కోరాలని యోచిస్తోంది. ఈ పథకాల కింద మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీలను నెరవేర్చడానికి అవసరమైన నిధుల కోసం కేంద్రం దృష్టిని ఆకర్షించేలా పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్