AP: నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో జరిగిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో 850 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తే, కూటమి ప్రభుత్వంలో 9 వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే 6 వేల కిలోమీటర్లు ఉన్నాయని వెల్లడించారు.