AP: కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ మొదలుపెట్టిందని ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ ఆరోపించారు. ‘క్రెడిట్ చోరీతో మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు క్రెడిట్ మాఫియాగా చెలామణి అవుతోంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ రోజు ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన కృషితో ఈరోజు మంచి ఫలితాలు వస్తుంటే క్రెడిట్ కోసం వెంపర్లాడుతున్నారు’ అని అశోక్ కుమార్ అన్నారు.