ఏపీ లిక్కర్ స్కామ్‌లో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్‌ను తెర మీదకు తెచ్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఘోరంగా విఫలమైందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతోందని.. లిక్కర్ స్కామ్ పేరిట ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.