AP: సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి దేవాదాయశాఖ అధికారులు, తహశీల్దార్లతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ కమిటీలు 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తాయని, ఆ నివేదికపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై జరిగిన జీఓఎం సమావేశంలో మంత్రి అనగానితో పాటు నారాయణ, పయ్యావుల, ఫరూక్ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఇతర భూముల కేటాయింపుపై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.