విద్యుత్ శాఖలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కారుణ్య నియామకాలు: మంత్రి

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఏపీ జెన్కో పరిధిలో 27 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి గొట్టిపాటి అందించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తూ బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తోందని మంత్రి వివరించారు.

సంబంధిత పోస్ట్