AP: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన ఇన్‌ఛార్జ్ దేవర మనోహర్ ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దీని వల్ల పర్యావరణం నాశనం అవుతుందన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భారీగా కమీషన్లు తీసుకుంటూ అక్రమ మైనింగ్ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.