స్థానిక సమరంపై వైసీపీలో ఆందోళన?

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్రంలో ప్రతి స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ పార్టీ కేడర్‌ను ఆదేశించారు. దాంతో వైసీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ పదవికి పోటీపడాలంటే రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అంత డబ్బు పెట్టి గెలిచినా, ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్