AP: అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి పవన్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా ఇంకా రాజధాని కోసం పోరాడటం బాధాకరమని పేర్కొన్నారు. తనకు తెలంగాణ, ఆంధ్ర అనే విభేద భావన లేదని, ‘తెలుగు నేల’ అనే ఐక్యత భావన మాత్రమే ఉండేదని చెప్పారు. ఏపీపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా టీడీపీతో కలిసి పనిచేస్తున్నామని పవన్ వెల్లడించారు.