ఏపీలో ఉలుకుపలుకు లేని కాంగ్రెస్!

AP: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల కమిషన్‌లో నిర్ణయాలు ఏకపక్షంగా సాగుతున్నాయని, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ దేశంలోని పలు నగరాల్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేపట్టాయి. వేలాది మంది కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మెజారిటీ రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఆందోళనలు ఏపీలో నామమాత్రంగా కూడా లేవు.

సంబంధిత పోస్ట్

✕
✕