AP: ప్రభుత్వ బ్యాంకులకు వరుస సెలవులు నేపథ్యంలో, అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆరోజు ఉదయాన్నే నగదు విత్ డ్రాపై బ్యాంకులకు SLBC ఆదేశాలు జారీ అయ్యాయని, 61.80 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,692 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వివరించారు. అయితే, అక్టోబర్ 1న కొత్త పెన్షన్ల పంపిణీ ఉండదని సమాచారం. ఈ ప్రకటన బ్యాంకు సమ్మె నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు తెరదించింది.