AP: అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడికి భార్య హారిక, పిల్లలు ఉన్నారు. హరినాథ్ పిల్లలు ఇంటి ముందు క్రికెట్ ఆడుతుంటారు. ఈ క్రమంలో తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కళ్యాణి అనే మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహించిన హరినాథ్ దంపతులు కళ్యాణిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి కొట్టారు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.