కానిస్టేబుల్ తుది ఫలితాలను ఇవాళ (శుక్రవారం) హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేయనున్నారు. జూన్ 1న జరిగిన తుది పరీక్షకు మొత్తం 37,600 మంది హాజరవ్వగా.. వీరిలో 33,921 మంది అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నారు. 2022లో 6,100 ఖాళీలతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. కోర్టులో పలు కేసులు నమోదవ్వడంతో ప్రక్రియ ఆలస్యమైంది.