రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ ఆవరణలో జరిగిన మాక్ అసెంబ్లీకి హాజరైన సీఎం చంద్రబాబు, విద్యార్థుల ప్రదర్శన బాగుందని ప్రశంసించారు. రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత అని, అందరిలో చైతన్యం రావాలని ఆయన అన్నారు. చాయ్‌వాలా ప్రధాని కావడం, అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడం రాజ్యాంగం ఇచ్చిన వరమని, తాను కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చి నాలుగోసారి సీఎం అయ్యానంటే అది రాజ్యాంగం కల్పించిన అవకాశమేనని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులు సభకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్